KTR: పారిశుధ్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చెయ్యడి: మంత్రి కేటీఆర్

  • వారం రోజుల్లో ప్రణాళిక పురపాలకశాఖకు సమర్పించాలి
  • పురపాలక సిబ్బందికి ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పించండి
  • కలెక్టర్ల సమావేశంలో మంత్రి  ఆదేశాలు

పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మంత్రి కేటీఆర్ కలెక్టర్లకు సూచించారు. మంత్రి కేటీఆర్ ఈ రోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పారిశుద్ధ్య ప్రణాళికను ఏడు రోజుల్లోగా పురపాలక శాఖకు సమర్పించాలని చెప్పారు.  

సమర్థంగా సేవలను అందించేందుకు పారిశుద్ధ్య సిబ్బందిని, వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. పురపాలక సిబ్బందికి ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. డంప్ యార్డులు లేని చోట భూ సేకరణ చేపట్టాలని సూచించారు. నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభా కనుగుణంగా పబ్లిక్ టాయిలెట్లు, షీ టాయిలెట్లు నెలకొల్పాలని మంత్రి కలెక్టర్లను కోరారు.

More Telugu News