Nara Lokesh: కులాన్ని చూడం అంటూనే ఓసీ కౌలురైతులకు మొండిచెయ్యి చూపారు: నారా లోకేశ్

  • రైతులకు పెట్టుబడి సాయం పథకంపై లోకేశ్ వ్యాఖ్యలు
  • ఒకేసారి ఇస్తామని చెప్పి ఇప్పుడు మడమతిప్పారంటూ విమర్శలు
  • 'వాయిదా పద్ధతి సీఎం' అంటూ జగన్ పై ధ్వజం

రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కులాన్ని చూడం అంటూనే ఓసీ వర్గానికి చెందిన కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారని ఆరోపించారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని చెప్పి ఇప్పుడు విడతల్లో ఇస్తామని మడమ తిప్పారని విమర్శించారు. మీ పార్టీ వలంటీర్లకు రూ.8000 ఇస్తూ, ఆరుగాలం శ్రమించే అన్నదాతకు రూ.625 ఇవ్వడం న్యాయమా అంటూ ప్రశ్నించారు.

నారా లోకేశ్ ఈ సందర్భంగా జగన్ ను 'వాయిదా పద్ధతి సీఎం'గా అభివర్ణించారు. "మీరు ప్రవేశపెట్టింది వైఎస్సార్ రైతు నిరాశ కార్యక్రమం. ఎన్నికల హామీల్లో రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు రూ.7,500 మాత్రమే ఇస్తూ రైతులకు కూడా రివర్స్ టెండరు వేశారు. 64 లక్షల మంది రైతులుంటే వారిని సగం తగ్గించుకుంటూ పోయారు" అంటూ విమర్శల వర్షం కురిపించారు.

More Telugu News