Tsrtc: ఈ నెల 21న ‘ఛలో ప్రగతిభవన్’: రేవంత్ రెడ్డి

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
  • సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు
  • మంత్రుల వ్యాఖ్యల వల్లే కార్మికుల ఆత్మహత్యలు

టీఎస్సార్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వారిని అణచివేస్తున్నారని టీ- కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నెల ‘21న చలో ప్రగతిభవన్’ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.

మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసిన రేవంత్, ఈ నెల 19న నిర్వహించే రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

More Telugu News