selfie: సెల్ఫీలకు వృద్ధ దంపతుల అద్భుత పోజులు.. అదుర్స్ అంటున్న నెటిజన్లు

  • ప్రేమకు వయసుతో సంబంధం లేదనడానికి ఈ వృద్ధ దంపతులే సాక్ష్యం
  • యువతకు ఏ మాత్రం తీసి పోకుండా పోజులు
  • దుర్గా పూజల సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన దంపతుల సెల్ఫీలు

ప్రేమకు వయసుతో సంబంధం లేదనడానికి ఈ వృద్ధ దంపతులే సాక్ష్యం. ఇటీవల ఈ దంపతులు దుర్గా పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ తో ఇలా సెల్ఫీలు తీసుకున్నారు. వీరు సెల్ఫీలు తీసుకున్న తీరు అక్కడ అందరినీ ఆకర్షించింది. యువతకు ఏ మాత్రం తీసి పోకుండా పోజులిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సమయంలో వారు సంప్రదాయ దుస్తుల్లోనే కనపడ్డారు.

వారు సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోలను అంజన్ అనే యువకుడు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇవి వైరల్ అవుతున్నాయి. ఆ వృద్ధ దంపతుల మధ్య ఉన్న ప్రేమ, సంప్రదాయబద్ధమైన ఆహార్యం నెటిజన్లను అబ్బుర పరుస్తోంది. వీరి సెల్ఫీలు అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ దంపతులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని, వారి కూతురు విదేశాల్లో నివసిస్తోందని తెలుస్తోంది.  
 

More Telugu News