Samanta: 'జాను' నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుంది: సమంత

  • తమిళంలో హిట్ కొట్టిన '96' మూవీ 
  • షూటింగు పూర్తి చేసుకున్న తెలుగు రీమేక్
  • తమిళంలో త్రిష చేసిన పాత్రలో సమంత  

తమిళంలో క్రితం ఏడాది విజయంతో పాటు ప్రశంసలను అందుకున్న చిత్రాల జాబితాలో '96' ముందువరుసలో కనిపిస్తుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్ .. త్రిష పాత్రలో సమంత నటించారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సమంత తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేసింది.

"ఇంతవరకూ నేను చేసిన పాత్రలు ఒక ఎత్తు .. ఈ సినిమాలోని 'జాను' పాత్ర ఒక ఎత్తు. అందువలన ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను. కచ్చితంగా ఇది నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుంది. విడుదల తరువాత ఈ సినిమాను చూసిన వాళ్లంతా ఇదే మాట చెబుతారనే నమ్మకం వుంది. ఇంత మంచి టీమ్ తో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా వుంది" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News