RaviBabu: అనుకోకుండా ఆర్టిస్టును అయ్యాను: దర్శకుడు రవిబాబు

  • దర్శకుడిని కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను 
  • రామానాయుడుగారు నన్ను ఆర్టిస్టును చేశారు
  • దర్శకత్వంపై ఎక్కువగా దృష్టి పెట్టానన్న రవిబాబు

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన విషయాల గురించి ప్రస్తావించాడు. "మొదటి నుంచి కూడా నాకు దర్శకుడిని కావడమే ఇష్టం. అందువలన సాంకేతికపరమైన అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాను. అయితే ఒక రోజున నన్ను రామానాయుడుగారు చూశారు. అప్పుడు ఒక బాడీ బిల్డర్ మాదిరిగా ఉండేవాడిని.

నన్ను చూసిన వెంటనే 'మనం వెతుకుతున్న ఆర్టిస్ట్ దొరికేశాడు' అని ఫోన్లో అవతలివారితో చెప్పేశారు. అలా 'శివయ్య' సినిమాలో నటించాను. నిజానికి నేను ఆర్టిస్టును అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని సినిమాల తరువాత, ఇండస్ట్రీకి నేను వచ్చింది ఆర్టిస్టును కావడానికి కాదు గదా అనుకుని మెగా ఫోన్ పట్టుకున్నాను. అప్పటి నుంచి డైరెక్షన్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ, నటుడిగా కూడా కొనసాగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News