High Court: సెలవులు పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం పిటిషన్

  • ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల వేతనంపై హైకోర్టులో వాదనలు 
  • విచారణ రేపటికి వాయిదా 
  • సమ్మెపై దాఖలైన మరో పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ  

కొన్ని రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా పాఠశాలలకు సెలవులను పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు వాదనలు విననుంది. మరోవైపు, కార్మికులకు సెప్టెంబరు నెల ఇవ్వాల్సిన వేతనంపై హైకోర్టు ఈ రోజు  వాదనలు విన్నది. అనంతరం దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. సమ్మెపై దాఖలైన మరో పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.

కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు. సెలవులతో తమ చదువుపై ప్రభావం పడుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విద్యా సంస్థలపై వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణం.

More Telugu News