82వ సారి రక్తదానం చేసిన సినీ నటుడు మహర్షి రాఘవ

15-10-2019 Tue 11:59
  • రక్తదానం విషయంలో స్ఫూర్తి దాతగా నిలుస్తున్న రాఘవ
  • చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఈరోజు రక్తదానం
  • అభినందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న. మనం దానం చేసే రక్తం మరో ప్రాణాన్ని నిలుపుతుంది. రక్తదానం విషయంలో ఇప్పటికే ఎందరో వ్యక్తులు ఇతరులకు స్ఫూర్తి దాతలుగా నిలిచారు. ఈ జాబితాలో సినీ నటుడు మహర్షి రాఘవ ముందు వరుసలో ఉంటారు. ఈ రోజు ఆయన తన జీవితంలో 82వ సారి రక్తదానం చేశారు. హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో తన రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా రాఘవకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. స్వయంగా రక్తదానం చేస్తూ... రక్తదానం చేసే విషయంలో ఇతరుల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు అభినందించారు.