monkey: కుక్క పిల్లలపై పందుల దాడి.. కాపాడిన కోతి

  • కర్ణాటకలోని విజయపురి జిల్లాలో ఘటన
  • తీవ్రంగా గాయపడిన ఓ కుక్కపిల్ల మృతి
  • వైరల్ అవుతున్న వీడియో

తల్లి నుంచి వేరుపడిన కుక్కపిల్లలపై పందులు దాడిచేయగా, అక్కడే ఉన్న ఓ కోతి వాటిని రక్షించిన ఘటన కర్ణాటకలోని విజయపురి జిల్లాలో జరిగింది. తల్లి నుంచి వేరుపడిన రెండు కుక్క పిల్లలు రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తుండగా గమనించిన పందులు ఒక్కసారిగా వాటిపై దాడికి దిగాయి. అక్కడే ఉన్న ఓ కొండముచ్చు వెంటనే రంగంలోకి దిగి పందులపై దాడిచేసి పరుగులు పెట్టించి కుక్కపిల్లలను రక్షించింది. అయితే, అప్పటికే వాటి దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ కుక్కపిల్ల మృతి చెందగా, మరో దానిని తనతోపాటు తీసుకెళ్లింది. కోతి దయాగుణానికి స్థానికులు అచ్చెరువొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


More Telugu News