ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ ను పువ్వాడ ఒప్పించాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్

14-10-2019 Mon 21:55
  • రేపటి కల్లా సీఎంను ఒప్పించాలి
  • లేనిపక్షంలో అజయ్ ను ఘెరావ్ చేస్తాం
  • సంగారెడ్డి డిపో కార్మికులతో హైదరాబాద్ తరలివస్తాం
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ సానుభూతితో వ్యవహరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు ఈరోజు నిర్వహించిన ఆందోళనకు ఆయన హాజరయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేంద్రగౌడ్ లకు ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ విలీనం విషయమై రేపటి కల్లా సీఎం కేసీఆర్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఒప్పించాలని డిమాండ్ చేశారు. అలా ఒప్పించని పక్షంలో సంగారెడ్డి డిపోకు చెందిన ఆరు వందల మంది కార్మికులతో హైదరాబాద్ తరలివస్తానని, అజయ్ ను హైదరాబాద్ లో ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు కేసీఆర్ ఫొటోలకు పాలు పోసి పూజలు చేసిన ఆర్టీసీ కార్మికులే నేడు ఆయన్ని నిందించే పరిస్థితికి రావడం దారుణమని అన్నారు.