gas cylinder: యూపీలో దారుణం.. గ్యాస్ సిలిండర్ పేలి కూలిన రెండంతస్తుల భవనం.. పదిమంది మృతి

  • శిథిలాల కింద మరికొందరు
  • సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
  • మొహ్మదాబాద్‌లో ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని మొహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఏకంగా పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ కారణంగానే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News