Talasani: మేము మనుషులం కాదా? కేసీఆరే పిలిచి మాట్లాడాలా?: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు
  • ప్రభుత్వం నియమించిన కమిటీకి డిమాండ్లను కూడా చెప్పలేదు
  • కేసీఆర్ ను టీజీవో, టీఎన్జీవో సాధారణంగానే కలిశారు

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రతి దానికి ముఖ్యమంత్రి కేసీఆరే పిలిచి మాట్లాడాలా? అని ఆయన అన్నారు. మంత్రులు, అధికారులు మేమంతా మనుషులు కాదా? అని ప్రశ్నించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని చెప్పారు. పండగ పూట సమ్మె చేయవద్దని విన్నవించారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని... ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీకి తమ డిమాండ్లను కూడా చెప్పలేదని మండిపడ్డారు. టీజీవో, టీఎన్జీవో నేతలు ముఖ్యమంత్రిని సాధారణంగానే కలిశారని చెప్పారు. ఆర్టీసీ అధికారులను ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించడం, సచివాలయంలోకి మీడియాకు అనుమతి నిరాకరణ తనకు తెలియదని అన్నారు.

More Telugu News