TSRTC: ఆర్టీసీ సమ్మె అంతా ఆ నాయకుని డ్రామా : మంత్రి గంగుల కమలాకర్‌

  • ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని ఈ రూటులో వచ్చాడు
  • కేసీఆర్‌ను బదనాం చేయాలని తలపెట్టాడు
  • పనీపాట లేని కాంగ్రెస్‌, బీజేపీలు వారికి గొంతు కలిపాయి

ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం అంటూ మాయమాటలు చెప్పి టీఎస్‌ ఆర్టీసీ కార్మికులను సమ్మెకు దింపింది ఓ స్వార్థపరుడైన నాయకుడని, ఎమ్మెల్సీ పదవి ఆశించిన అతను ఆ ఆశ నెరవేరక పోవడంతో కేసీఆర్‌ను బదనాం చేసేందుకు ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి కోసం ఓ నాయకుడు ఆడుతున్న డ్రామాలో కార్మికులు చిక్కుకున్నారని తెలిపారు. పనీపాటాలేని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు వీరితో గొంతు కలిపి ఎక్కడ టెంట్‌ కనిపిస్తే అక్కడికి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఒక్కో నాయకుడికి ఒక్కో పార్టీ అండ ఉందని, వీరంతా తమ స్వార్థం కోసం కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజల మద్దతు లేదన్నారు. సమ్మె ప్రభావం కనిపించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, బస్సుల కొరత లేదని స్పష్టం చేశారు.

More Telugu News