TSRTC: మీరు అధికారంలో ఉన్నచోట ఆర్టీసీని విలీనం చేశారా? : బీజేపీకి ఎర్రబెల్లి సూటి ప్రశ్న

  • సంస్థను బాగు చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారు
  • రూ.3,303 కోట్ల సాయం అందించారు
  • ప్రైవేటీకరణ చేస్తారని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు

టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ప్రైవేటీకరణకు ఎత్తుగడ వేస్తోందని దుష్ప్రచారం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూటిగా ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ శాసన సభా పక్షం కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆర్టీసీని బాగు చేసేందుకు అన్ని విధాలా సహకరించిన కేసీఆర్‌ ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి కేసీఆర్‌ 3,303 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధికోసం బీజేపీ నాయకులు కొనసాగిస్తున్న డ్రామాలు  కట్టిపెట్టాలని హితవు పలికారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్‌, బీజేపీలు ఇదే తీరును ప్రదర్శించి కేంద్రం నుంచి నిధులు రాకుండా కుట్రలు చేశాయన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ప్రజలు ఘోరంగా ఓడించారని గుర్తు చేశారు.

More Telugu News