Khammam District: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్.. బస్టాండ్ల వద్ద కార్మికుల ధర్నా

  • శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నంతో మారిన పరిస్థితులు
  • 9వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
  • ఖమ్మంలో డిపోల నుంచి బయటకు రాని బస్సులు

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆర్టీసీ బస్టాండ్ల వద్దకు చేరుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని బస్టాండ్లు, డిపోల వద్ద ఆందోళనకు దిగిన కార్మికులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల బంద్‌కు ప్రతిపక్షాలతోపాటు వివిధ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది విధులకు వచ్చేందుకు భయపడుతున్నారు.

కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించిన కార్మిక నేతలు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

More Telugu News