Rohit Sharma: కాళ్లకు నమస్కరించబోయిన అభిమాని... పట్టుతప్పి కిందపడిపోయిన రోహిత్ శర్మ

  • పూణే టెస్టులో ఆసక్తికర దృశ్యం
  • మైదానంలోకి వచ్చిన రోహిత్ అభిమాని
  • అత్యుత్సాహంతో అభిమాన క్రికెటర్ ను ఇబ్బందిపెట్టిన వైనం

పూణే వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నేడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ వీరాభిమాని అత్యుత్సాహం ప్రదర్శించి టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కిందపడేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ సేనురాన్ ముత్తుసామి అవుటవగా వెర్నార్ ఫిలాండర్ క్రీజులోకి వచ్చాడు. అదే సమయంలో స్టాండ్స్ లోంచి ఓ అభిమాని పరుగున మైదానంలోకి వచ్చాడు.

నేరుగా స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వద్దకు వెళ్లి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించాడు. అభిమాని ఆ విధంగా చేస్తాడని ఊహించని రోహిత్ శర్మ తత్తరపాటుకు గురయ్యాడు. ఆ అభిమానిని నిలువరించబోయి తాను పట్టుతప్పి కిందడిపోయాడు. చివరికి భద్రతా సిబ్బంది వచ్చి ఆ యువకుడ్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్ టీమిండియా ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు పూయించింది.

More Telugu News