Maharashtra: 'మహా' ఓటర్లను ఊరిస్తున్న శివసేన మేనిఫెస్టో!

  • మహారాష్ట్రలో ఎన్నికల వేడి
  • రూ.10కే భోజనం అంటున్న శివసేన
  • 300 యూనిట్ల వరకు విద్యుత్ పై 30 శాతం రాయితీ

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలు తీసుకువస్తున్నాయి. ప్రధానంగా శివసేన ప్రకటించిన మేనిఫెస్టో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు, పేదలకు అందుబాటులో వైద్యం, రాష్ట్రవ్యాప్తంగా 1000 భోజనాలయాలు, వాటిలో రూ.10కే భోజనం, 300 యూనిట్ల వరకు విద్యుత్ వాడకంపై 30 శాతం రాయితీ, మరాఠీలో 80 శాతం పైగా మార్కులు తెచ్చుకున్న 10, ప్లస్ టూ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ఏటా రూ.10 వేలు నగదు బదిలీ, యువతకు రూ.15 లక్షల వరకు ఆర్థికసాయం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కాలేజీల వరకు ప్రత్యేక బస్సులు వంటివి శివసేన మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

ఇవేకాకుండా రైతులకు ఊరట కలిగించేలా ఐదేళ్లపాటు ఎరువులు, పురుగుమందుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయబోరట. ఇప్పుడున్న ధరలనే వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

More Telugu News