TSRTC: టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులకు బీజేపీ సంఫీుభావం...బస్‌ భవన్‌ ఎదుట ధర్నా

  • కార్మికులతో కలిసి ర్యాలీగా వెళ్లి బైఠాయింపు
  • పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. ఈరోజు ఉదయం కార్మికుల ఐక్యకార్యాచరణ సమితితో కలిసి బీజేపీ నేతలు హైదరాబాదులోని బస్‌ భవన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి బస్‌ భవన్‌ వరకు బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ర్యాలీగా బస్‌ భవన్‌కు చేరుకుని అక్కడ బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఎనిమిదో రోజు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. నిర్మల్‌లో మౌన ప్రదర్శన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్‌ డిపో ఎదుట ధర్నా చేశారు. నిజామాబాద్‌ లో మౌన ప్రదర్శన చేశారు.

More Telugu News