rti: భారత ప్రజాస్వామ్య పయనంలో ఆర్టీఐ ఓ మైలురాయి: అమిత్ షా

  • ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తొలగిస్తోంది
  • పరిపాలన యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది
  • ఆర్టీఐ తన లక్ష్యాలను సాధించింది

దేశ ప్రజాస్వామ్య పయనంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఓ పెద్ద మైలురాయి వంటిదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తొలగించే వారధిలా ఇది ఉపయోగపడుతోందని తెలిపారు. ఆర్టీఐ తన లక్ష్యాలను సాధించిందని అన్నారు.  
 
 'ఆర్టీఐ కారణంగా పారదర్శకత, జవాబుదారీతనాలతో మంచి పరిపాలన అందించవచ్చు. పరిపాలనా యంత్రాంగంలో ఈ రెండింటినీ పెంచడానికి ఆర్టీఐ ఉపయోగపడింది. పరిపాలన యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకాన్ని కూడా పెంచింది' అని వ్యాఖ్యానించారు.

More Telugu News