Venkatesh: వెంకటేశ్ తో సినిమాను ఖరారు చేసుకున్న వినాయక్

  • వెంకటేశ్ కి కథ వినిపించిన వినాయక్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేశ్ 
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి 

తేజుతో 'ఇంటెలిజెంట్' వంటి ఫ్లాప్ సినిమా చేసిన తరువాత మరో ప్రాజెక్టును వినాయక్ పట్టాలెక్కించలేకపోయాడు. బాలకృష్ణతో ఓ భారీ సినిమా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరువాత రవితేజతో ఓ మాస్ మసాలా మూవీ చేయాలని చూశాడు. కొన్ని కారణాల వలన అది కూడా కుదరలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఒక మంచి కథను సిద్ధం చేసుకుని వెంకటేశ్ కి వినిపించగా వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినాయక్ తనే హీరోగా 'శీనయ్య' అనే సినిమా చేస్తున్నాడు. మరోపక్క, తరుణ్ భాస్కర్ తో సినిమాకి వెంకటేశ్ సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే, ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం.

More Telugu News