Kangana Ranaut: 'తలైవి' కోసం షూటింగుకి దిగుతోన్న కంగనా

  • వచ్చేనెల 6 నుంచి 'తలైవి' షూటింగ్ మొదలు 
  • రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్ 
  • కీలకపాత్రల్లో అరవింద్ స్వామి - ప్రకాశ్ రాజ్

అందాల కథానాయికగా .. సమర్థురాలైన రాజకీయ నాయకురాలిగా దివంగత జయలలిత ప్రజల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు వున్నాయి. అందువలన ఆమె బయోపిక్ ను 'తలైవి' పేరుతో దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్నాడు.

జయలలిత పాత్రను కంగనా రనౌత్ చేయనుంది. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది తాజా సమాచారం. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. జయలలిత యుక్త వయసుకి సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్టుగా చెబుతున్నారు. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి .. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించనున్న ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను విడుదల చేనున్నారు.

More Telugu News