India: ఇండియాకు వచ్చే ముందు పాకిస్థాన్ కు షాకిచ్చిన చైనా అధ్యక్షుడు!

  • కశ్మీర్ ద్వైపాక్షిక అంశమే
  • ఇండియా, పాక్ లు పరిష్కరించుకోవాలి
  • ఇమ్రాన్ కు చెప్పిన చైనా

ఇండియాకు బయలుదేరే ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టే షాక్ ఇచ్చారు. చైనా అధ్యక్షుడి పర్యటన నేడు ప్రారంభం కానుండగా, 36 గంటల క్రితం వరకూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలోనే ఉన్నారు. బీజింగ్ లో జిన్ పింగ్ తో చర్చలు జరిపారు కూడా. ఆ సమయంలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాగా, ఈ వ్యవహారాన్ని ఇండియా, పాక్ లు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిందే తప్ప, మరో దేశం కల్పించుకునే పరిస్థితి లేదని జిన్ పింగ్ కుండ బద్దలు కొట్టారు. ఇటీవలి ఐరాస సమావేశాల్లో పాకిస్థాన్ కు కొంత అనుకూలంగా మాట్లాడిన చైనా, ఆపై వారం రోజులు గడిచేసరికి, స్వరాన్ని మార్చుకోవడం భారత్ సాధించిన దౌత్య విజయమే!

More Telugu News