Lalitha Jewellers: అనూహ్యంగా కోర్టుకు వచ్చి లొంగిపోయిన లలితా జ్యూయెలర్స్ చోరీ కేసు నిందితుడు!

  • ఈ నెల 2 న దొంగతనం
  • రూ. 13 కోట్ల విలువైన నగల చోరీ
  • తిరువణ్ణామలై కోర్టులో లొంగిన సురేశ్

తమిళనాడులోని తిరుచ్చిలో ఈ నెల 2న జరిగిన రూ. 13 కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు, 'మనసా వినవే' నిర్మాత సురేశ్, అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, 5 కిలోల విలువైన ఆభరణాలను రికవరీ చేశారు.

చిత్ర సీమతో సంబంధాలున్న సురేశ్, దొంగతనం అనంతరం ఓ హీరోయిన్ తో కలిసి శ్రీలంక పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇదే కేసులో సూత్రధారిగా భావిస్తున్న మురుగన్, ఏపీ లేదా తెలంగాణలో తలదాచుకుని ఉండవచ్చని భావించారు. ఈ నేపథ్యంలో తిరువణ్ణామలై జిల్లా చెంగమ్ కోర్టుకు వచ్చిన సురేశ్, న్యాయమూర్తి విఘ్నేశ్ ఎదుట లొంగిపోయాడు. అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించారు న్యాయమూర్తి. అనంతరం సురేశ్ ను జైలుకు తరలించిన పోలీసులు, కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News