తమిళిసై నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు: వీహెచ్

10-10-2019 Thu 16:50
  • గత గవర్నర్ కూడా ఇలాగే వ్యవహరించేవారు
  • పాత గవర్నర్ మాదిరి వ్యవహరించవద్దు 
  • అలయ్ బలయ్ కార్యక్రమంలో వీహెచ్ వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత గవర్నర్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించేవారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి వీహెచ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై వీహెచ్ మాట్లాడుతూ, పాత గవర్నర్ మాదిరి వ్యవహరించరాదని తమిళిసైని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమను జర చూసుకోవాలంటూ దత్తాత్రేయను కోరారు.