Sensex: తీవ్ర ఒత్తిడికి గురైన బ్యాంకింగ్ స్టాకులు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 297 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 72 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్

నిన్న భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ నష్టాల బాట పట్టాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురవడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 297 పాయింట్లు నష్టపోయి 37,880కి పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 11,240కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.33%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.66%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.20%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.94%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.09%), యస్ బ్యాంక్ (-5.44%), టాటా మోటార్స్ (-3.43%), వేదాంత లిమిటెడ్ (-3.19%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.49%).

More Telugu News