Salman Khan: 'బిగ్ బాస్'ను బ్యాన్ చేయవలసిందే: కర్ణిసేన డిమాండ్

  • ఆది నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న 'బిగ్ బాస్'
  • ప్రస్తుతం నడుస్తున్నది 13వ సీజన్ 
  •  షోను ఆపేయాలంటూ 'కర్ణిసేన' డిమాండ్

మొదటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కుంటూనే బాలీవుడ్లో బిగ్ బాస్ షో కొనసాగుతోంది. అలా ప్రస్తుతం ఈ రియాలిటీ షో 13వ సీజన్ జరుపుకుంటోంది. ఈ సీజన్ కి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. భారతీయ సంప్రదాయాలకి విరుద్ధంగా వున్న ఈ షోను వెంటనే నిలిపివేయాలని రాజస్థాన్ కి చెందిన 'కర్ణిసేన' డిమాండ్ చేస్తోంది.

కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని విధంగా వున్న ఈ రియాలిటీ షోను వెంటనే బ్యాన్ చేయాలంటూ,కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కి 'కర్ణిసేన' ప్రతినిధులు ఒక లేఖను సమర్పించారు. జాతీయ మీడియా వేదికగా హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తోన్న ఈ షోను తక్షణమే నిలిపివేయాలంటూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి కూడా వారు ఒక లేఖను అందజేశారు.

More Telugu News