Jammu And Kashmir: రెండు నెలల తర్వాత టూరిస్టుల కోసం తెరుచుకున్న జమ్మూకశ్మీర్ తలుపులు

  • ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్న కేంద్రం
  • ఇతరులు ఆ రాష్ట్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు
  • ఈరోజు నుంచి టూరిస్టులను అనుమతిస్తూ ఉత్తర్వుల జారీ

జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా... కేంద్ర ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. భారీ ఎత్తున భద్రతాబలగాలను మోహరింపజేసి, విద్రోహ శక్తులు రెచ్చిపోకుండా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో కశ్మీర్ లో పర్యటించేందుకు రాజకీయ పార్టీల నేతలను కూడా అనుమతించలేదు. కట్టుదిట్టమైన చర్యల కారణంగా జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, రెండు నెలల తర్వాత జమ్మూకశ్మీర్ లోకి ఈ రోజు నుంచి మళ్లీ పర్యాటకులను అనుమతిస్తున్నారు.

జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచనల మేరకు పర్యాటకులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఆ రాష్ట్ర హోం శాఖ నిన్న ఉత్తర్వులను జారీ చేసింది. జమ్మూకశ్మీర్ లో పర్యటించాలనుకుంటున్న టూరిస్టులకు అవసరమైన సహాయసహకారాలను పూర్తిగా అందిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

More Telugu News