Jagan: రివర్స్ టెండరింగ్ కు సంబంధించి కీలక ఆదేశాలను ఇచ్చిన జగన్

  • బిడ్డింగ్ లో పాల్గొనే తొలి 60 శాతం మందికే రివర్స్ టెండరింగ్ లో పాల్గొనే అవకాశం
  • రూ. 10 లక్షల నుంచి రూ. 100 కోట్ల విలువైన టెండర్లకు రివర్స్ టెండరింగ్
  • జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం

రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బిడ్డింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేలా, మరింత లబ్ధి కలిగేలా ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను జారీ చేశారు. బిడ్డింగ్ లో పాల్గొనే తొలి 60 శాతం మందికే రివర్స్ టెండరింగ్ లో అవకాశం కల్పించాలని ఆదేశించారు.

రూ. 10 లక్షల నుంచి రూ. 100 కోట్ల విలువైన టెండర్లకు రివర్స్ టెండరింగ్ జరపాలని అధికారులకు చెప్పారు. రివర్స్ టెండరింగ్ లో పోటీని పెంచడానికి, ప్రజాధనాన్ని ఎక్కువగా ఆదా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ మధ్య సమన్వయం కోసం ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆదేశించారు. శాశ్వతంగా ఉండేలా పాలసీని రూపొందించాలని చెప్పారు. జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

More Telugu News