Jyotiraditya Sindhiya: కాంగ్రెస్ లో అత్యవసరంగా ఆత్మశోధన అవసరం: ఖుర్షీద్ మాదిరే గళం విప్పిన జ్యోతిరాదిత్య సింథియా

  • ఖుర్షీద్ వ్యాఖ్యలను మరువకముందే సింధియా సంచలన వ్యాఖ్యలు
  • పార్టీ పరిస్థితిని విశ్లేషించుకోవాలి
  • ఎన్నికల తరువాత పరిస్థితి దిగజారిందన్న సింథియా

కాంగ్రెస్ ను కాపాడాల్సిన రాహుల్ గాంధీ దూరంగా వెళ్లిపోతున్నారని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలను మరచిపోకముందే, యువనేత జ్యోతిరాదిత్య సింథియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యవసరంగా ఆత్మశోధన జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 కాంగ్రెస్ నాయకత్వ లేమిలో ఉందని ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సింథియాను కోరిన వేళ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరులు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెబుతూనే, ఆత్మవిమర్శ అత్యవసరమని, పార్టీ పరిస్థితిని విశ్లేషించి, మరింత మెరుగైన స్థితికి చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాజాగా పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన జ్యోతిరాదిత్య సింథియా, సార్వత్రిక ఎన్నికల తరువాత, ముఖ్యంగా గత రెండు నెలలుగా, పార్టీ పరిస్థితి మరింతగా దిగజారిందని అన్నారు.

More Telugu News