Tirumala: ఖాళీగా కనిపిస్తున్న తిరుమల వీధులు!

  • ముగిసిన బ్రహ్మోత్సవాలు
  • 8 కంపార్టుమెంట్లలో సాధారణ భక్తులు
  • ఆర్జిత సేవల పునరుద్ధరణ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో, నిన్నమొన్నటి వరకూ కిటకిటలాడిన తిరుమాడ వీధులు, యాత్రికుల వసతి సముదాయాలు ఇప్పుడు బోసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం కేవలం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. వారికి నాలుగు గంటల్లోపే దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దు చేసిన ఆర్జిత సేవలను, దివ్య దర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించామని టీటీడీ ప్రకటించింది. నిన్న 72 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రూ. 2.40 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

More Telugu News