Chinthamaneni Prabhakar: చింతమనేనికి మరో కేసులో జ్యుడీషియల్ రిమాండ్

  • మాజీ సర్పంచ్ ను చిత్రహింసలు పెట్టారంటూ చింతమనేనిపై కేసు
  • ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగింపు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ ను విధించింది. మాజీ సర్పంచ్ కృష్ణారావును చిత్రహింసలు పెట్టారంటూ నమోదైన కేసుకు సంబంధించి ఈ రోజు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ ను విధించింది. ఇతర కేసుల నేపథ్యంలో చింతమనేని ఇప్పటికే ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, పెదవేగి మండలం గార్లమడుగు గ్రామ సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టు మట్టి తరలింపు వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులకు కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, కృష్ణారావును చింతమనేని తన ఇంటికి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై 2018లో పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

More Telugu News