Telangana: సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రకుమార్ విమర్శలు

  • కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు
  • అది నోరా? మోరీనా?
  • ఏ డ్రైవర్ కు, కండక్టర్ కు రూ.50 వేలు ఇస్తున్నారు?  

సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్ర కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెకు హైదరాబాద్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మద్దతు తెలిపింది. ఈ సమావేశానికి హాజరైన చంద్రకుమార్ మాట్లాడుతూ, నాడు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు.

అంతపెద్ద మనిషిని అలా అనకూడదు కానీ తప్పట్లేదంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేసీఆర్ ది నోరా? మోరీనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు నెలకు యాభై వేల రూపాయల జీతం ఇస్తున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ డ్రైవర్ కు, కండక్టర్ కు అంత మొత్తం ఇస్తున్నారో చూపించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం తదితర రంగాల ద్వారా అందించే ప్రజాసేవపై పన్నులు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆ పన్నుల నుంచి ఆర్టీసీని మినహాయిస్తే నష్టాల్లో ఉండే ప్రసక్తే లేదని అన్నారు.

More Telugu News