Narendra Modi: ఈ దేశద్రోహం కేసులు ప్రధాని ఆశయాలకు విరుద్ధం.. వరుస ట్వీట్లతో కమల్ ఆగ్రహం

  • దేశ సామరస్యాన్నే మోదీ కోరుకుంటారు
  • ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఈ కేసులేంటి?
  • సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి

మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాసిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం, రామచంద్రగుహ సహా 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసులు పెట్టడంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లు చేస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

 దేశం సామరస్యంగా ఉండాలన్న ప్రధాని మోదీ ఆశయాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. దేశం సామరస్యంగా ఉండాలని మోదీ కోరుకుంటారని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలు విన్న వారికి ఇది అర్థమవుతుందని అన్నారు. మరి ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తారని కమల్ ప్రశ్నించారు.

49 మంది ప్రముఖులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఓ పౌరుడిగా తాను కోరుకుంటున్నట్టు కమల్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. బీహార్‌లో వీరిపై నమోదైన దేశద్రోహం కేసులను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కమల్ కోరారు.

More Telugu News