TATA: అత్యంత దయనీయంగా 'నానో' పరిస్థితి... ఏడాదిలో ఒక్క కారు అమ్మకం!

  • రతన్ టాటా కలల కారుగా గుర్తింపు
  • 2009లో మార్కెట్లోకి వచ్చిన నానో
  • దారుణంగా పడిపోయిన అమ్మకాలు

టాటా మోటార్స్ ను ప్రపంచ విపణిలో అగ్రగామిగా నిలబెట్టాలని, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారు కూడా కారులో విహరించాలన్న అభిలాషతో రతన్ టాటా నానో కారును తీసుకువచ్చారు. కానీ, ఆయన ఆకాంక్షకు తీవ్ర విఘాతం ఏర్పడింది. నానో కారు అమ్మకాలు నానాటికీ తీసికట్టుగా తయారవడమే కాదు, సంస్థ చరిత్రలోనే అత్యంత దారుణ వైఫల్యంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమ్ముడైంది ఒక్కటే. గత తొమ్మిది నెలల్లో నానో కర్మాగారాల నుంచి ఒక్క కారు కూడా తయారుకాలేదు.

2008లో తెరపైకి వచ్చిన నానో మొదట్లో సంచలనం సృష్టించే విధంగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది మార్కెట్లోకి వచ్చినప్పుడు తొలినాళ్లలో బాగానే అమ్మకాలు జరిగినా, ఆ తర్వాత తీవ్రస్థాయిలో పతనమైంది. ప్రస్తుతానికి తయారీకేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోగా, వచ్చే ఏడాదితో అధికారికంగా నానో అంతర్ధానం కానుంది.

More Telugu News