Rafale: షెడ్యూల్ ప్రకారం రాఫెల్ అందించడం సంతోషదాయకం: రాజ్ నాథ్ సింగ్

  • తొలి రాఫెల్ అందుకున్న రాజ్ నాథ్ సింగ్
  • రాఫెల్ లో విహారం
  • భారత వాయుసేనకు తిరుగులేని శక్తిగా పేర్కొన్న వైనం

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా విమానానికి ఆయుధపూజ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, నిర్ణీత సమయానికి తొలి రాఫెల్ ను అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కచ్చితంగా భారత వాయుసేనకు తిరుగులేని శక్తిగా మారుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరా కూడా ఉన్నారు. కాగా, రాఫెల్ ను అందుకున్న సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఆ విమానంలో చక్కర్లు కొట్టారు. డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ఆవరణలో కాసేపు విహరించారు.

More Telugu News