Rafale: తొలి 'రాఫెల్' కు టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీసిన రాజ్ నాథ్ సింగ్

  • 'రాఫెల్' ను అప్పగించిన ఫ్రాన్స్
  • స్వీకరించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్
  • విమానానికి ఆయుధపూజ

అత్యంత అధునాతన 'రాఫెల్' యుద్ధ విమానం ఇప్పుడు భారత్ అమ్ములపొదిలో చేరింది. ఈ ఫ్రెంచ్ తయారీ జెట్ ఫైటర్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు. వాయుసేన దినోత్సవంతో విజయదశమి కూడా కలిసిరావడంతో రాజ్ నాథ్ తొలి రాఫెల్ కు ఫ్రెంచ్ గడ్డపైనే ఆయుధపూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, ఆ యుద్ధ విహంగంపై కుంకుమ మిశ్రమంతో 'ఓం' అని రాశారు. అంతేకాదు, విమానం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీశారు.

ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వద్ద ఉన్న డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు చెందిన రాఫెల్ తయారీ యూనిట్ లో ఈ అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఒప్పందం ప్రకారం భారత్ కు డసాల్ట్ ఏవియేషన్ సంస్థ 36 రాఫెల్ యుద్ధ విమానాలను అందించాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్ నాథ్ అందుకున్నది తొలి విమానం. దీనికున్న అద్భుత పోరాట సామర్థ్యాల దృష్ట్యా భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా వాయుశక్తిని సముపార్జించుకున్నట్టయింది.

More Telugu News