Bill Gates: మలేరియా సమూల నిర్మూలనకు బిల్ గేట్స్ మాస్టర్ ప్లాన్!

  • దోమల్లో పునరుత్పత్తి కాకుండా చూడాలి
  • 2040లోగా మలేరియాను అరికట్టే అవకాశం
  • ప్రపంచమంతా కదలాలన్న బిల్ గేట్స్

భూ మండలాన్ని మలేరియా రహితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి మలేరియా సమూల నిర్మూలనకు సూచనలు ఇచ్చిన ఆయన, దోమల్లో పునరుత్పత్తి కాకుండా జీన్స్ ని ఇంజక్ట్ చేస్తే, 2040లోగా మలేరియాను పూర్తిగా అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది ఏ ఒక్క దేశమో కాకుండా, అన్ని దేశాలూ కలిసికట్టుగా చేయాల్సి వుంటుందని, ఈ మొత్తం ప్రక్రియకు గేట్స్ - మిలిందా ఫౌండేషన్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని పీడిస్తున్న పోషకాహార లోపాలను అధిగమించేలా శాస్త్రవేత్తలు వినూత్న పరిశోధనలు చేయాల్సి వుందని అన్నారు.

More Telugu News