TV9: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై సీబీఐ విచారణ జరపాలంటూ సీజేఐకి లేఖ రాసిన విజయసాయిరెడ్డి

  • రవిప్రకాశ్ పై ఈడీ విచారణకు రంగం సిద్ధం
  • రవిప్రకాశ్ అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణ
  • పలువురిని మోసం చేశాడంటూ వెల్లడి

టీవీ9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని, అతని స్కాంలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. రవిప్రకాశ్ ఆర్బీఐ నిబంధనలు, ఫెమా ఉల్లంఘనలకు పాల్పడడంతో పాటు మనీ లాండరింగ్ చేశాడని, ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని తన లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం రవిప్రకాశ్ పై ఈడీ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అతనిపై సీబీఐ విచారణ కూడా జరపాలని విజయసాయి అంటున్నారు.

రవిప్రకాశ్... అంతర్జాతీయస్థాయిలో బ్యాంకులను మోసం చేసిన మొయిన్ ఖురేషీతోనూ, సీబీఐ కేసుల్లో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీశ్ తోనూ కలిసి పలువురిని మోసం చేశాడని విజయసాయి తన లేఖలో తెలిపారు. హవాలా సొమ్ముతో కెన్యా, ఉగాండా దేశాల్లో రవిప్రకాశ్ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. రవిప్రకాశ్ వ్యాపారాలు, షేర్ల వివరాలను ఆధారాలతో సహా లేఖలో పొందుపరిచారు.

More Telugu News