Telangana: ఆర్టీసీ కార్మికులు తమను తాము 'సెల్ఫ్ డిస్మిస్' చేసుకున్నారు: సీఎం కేసీఆర్

  • కార్మిక సంఘాల అతిప్రవర్తనే ఈ చర్యలకు కారణమన్న కేసీఆర్
  • ఆందోళన చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • ఆర్టీసీ ప్రయివేటీకరణ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేదని వెల్లడి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. పట్టువిడవబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేస్తుండగా, గడువులోగా విధుల్లో చేరకుండా ఆర్టీసీ కార్మికులు తమను తాము 'సెల్ఫ్ డిస్మిస్' చేసుకున్నారని సీఎం కేసీఆర్ అంటున్నారు. కార్మికులు వాళ్లంతట వాళ్లే విధుల నుంచి తప్పుకున్నారని, ఆర్టీసీ కార్మిక సంఘాల అతిప్రవర్తనే ఈ చర్యలకు ప్రధాన కారణమని ఆరోపించారు. డిపోలు, బస్టాండ్ల వద్ద ఆందోళన చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆర్టీసీ ప్రయివేటీకరణ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేదని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడడమే తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని, సంస్థను లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది మాత్రమే కార్మికులు ఉన్నారని తెలిపారు.

More Telugu News