Raghunandan Rao: ఆర్టీసీ భూములను కేసీఆర్ తన బంధువులకు ధారాదత్తం చేస్తున్నారు: రఘునందన్

  • ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
  • ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు యత్నిస్తున్నారు
  • టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన బంధువులకు ఆర్టీసీ భూములను ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. హైదరాబాదులోని బీహెచ్ఈఎల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో కలసి రఘునందన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు పలికేందుకు అన్ని కార్మిక, ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయని రఘునందన్ అన్నారు. టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని... కార్మికులపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

More Telugu News