Kerala: కుటుంబ సభ్యులు ఆరుగురినీ చంపింది నేనే... అంగీకరించిన కేరళ యువతి జోలీ!

  • ఆస్తి కోసమే హత్యలు
  • పొటాషియం సైనైడ్ ను వాడాను
  • పోలీసుల విచారణలో జోలీ

ఇంట్లోని ఒక్కొక్కరినీ అడ్డు తొలగించుకుంటే, ఆస్తిని సొంతం చేసుకోవచ్చన్న ఆశతో పొటాషియం సైనైడ్ ను ఉపయోగించి, ఆరుగురిని హత్య చేసిన మాట వాస్తవమేనని, కేరళలో సంచలనం రేపిన హత్యల కేసు నిందితురాలు జోలీ పోలీసుల విచారణలో అంగీకరించింది. ఈ హత్యలను ఆమె 14 ఏళ్ల వ్యవధిలో చేసింది.

 తొలుత సాధారణ మరణాలుగా భావించినా, ఆపై అనుమానం వచ్చి, ప్రత్యేక సిట్ టీమ్ రంగంలోకి దిగి, కూపీ లాగి, జోలీ పాత్రను వెలుగులోకి తెచ్చింది. జోలీని స్వయంగా విచారించిన కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్, హత్యలు జరిగిన తీరు తనకు విస్మయం కలిగించిందని వ్యాఖ్యానించారు. జోలీ, ఆమె రెండో భర్తకు, కేసులో ప్రమేయమున్న ఇతర నిందితులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు తమకు కీలక ఆధారాలను అందించాయని ఆయన అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ జోలీ సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో 12 మందిని విచారిస్తున్నామని అన్నారు. 2008లో హత్యకు గురైన టామ్ థామస్ కుమారుడు రోజో థామస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును రీ ఓపెన్ చేశామని ఆయన తెలిపారు.

More Telugu News