Ayodya: రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • నవంబరు 18న ప్రారంభిస్తామంటూ వ్యాఖ్యలు
  • రాంలీలా కార్యక్రమంలో మాట్లాడుతూ వెల్లడి
  • కోర్టులో నడుస్తున్న వివాదం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

More Telugu News