Yashika: పార్టీ ముగించుకుని వస్తూ, యాక్సిడెంట్ చేసిన హీరోయిన్ యషికా!

  • చెన్నైలో ఘటన
  • నుంగంబాక్కం సమీపంలో అదుపుతప్పిన కారు
  • కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు

ప్రముఖ దక్షిణాది నటి యషికా, ఓ పార్టీ అనంతరం, తన స్నేహితులతో కలిసి వస్తూ, యాక్సిడెంట్ చేసింది. చెన్నైలోని నుంగంబాక్కం సమీపంలో ఈ ఘటన జరిగింది. యషికా కారు అత్యంత వేగంతో దూసుకొస్తూ, రోడ్డు పక్కనే నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టగా, అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె కారు హారింగ్‌ టన్‌ రోడ్ వద్ద అదుపు తప్పినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే బాధితుడిని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాండీ బజార్‌ పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రమాదంలో యషిక ప్రయాణిస్తున్న కారు సైతం బాగా దెబ్బతింది. కారులో యషిక తన ఫ్రెండ్స్ తో ఉందని, అంతకుముందే వారు ఓ పార్టీని ముగించుకుని బయలుదేరారని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News