USA: పాఠశాల వార్షికోత్సవంలో పోల్ డ్యాన్స్... వికటించిన వినోదం.. వీడియో ఇదిగో!

  • యూఎస్ లోని కన్సాస్ లో ఘటన
  • డబ్బులు వెదజల్లిన దృశ్యాలు వైరల్
  • క్షమాపణ చెప్పిన కన్సాస్ అధికారులు

ఓ అథ్లెట్ల పాఠశాల వార్షికోత్సవంలో ముందుగా షెడ్యూల్ ప్రకారం వేసుకున్న వినూత్న కార్యక్రమాల ఆలోచన, అప్పటికి బాగానే ఉన్నప్పటికీ, ప్రోగ్రామ్ అనంతరం మాత్రం తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది. యూఎస్ లోని కన్సాస్ అథ్లెటిక్ విభాగం, 'లేట్ నైట్ ఇన్ ది పోహాగ్' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించగా, మెన్స్ అండ్ ఉమెన్స్ బాస్కెట్ బాల్ లోకల్ సీజన్ మొదలైంది.

అంతవరకూ బాగానే ఉంది. అయితే, ఈ వేడుకల కోసం సదరు స్కూల్ ఇచ్చిన కార్యక్రమాల జాబితా తొలుత అందరికీ నచ్చింది. వాటిని చక్కగా ప్రదర్శించారు కూడా. అందులో పోల్ డ్యాన్స్, డబ్బులను వెదజల్లే మనీ గన్ పై మాత్రం విమర్శలు వచ్చాయి.

 ఓ యువతి స్టేజ్ పై పోల్ డ్యాన్స్ చేస్తుండగా, మరో యువతి, మనీ గన్ తీసుకుని, స్టేజ్ నలువైపులా తిరుగుతూ డబ్బులను వెదజల్లడం, కరెన్సీ కాగితాలను అందుకునేందుకు వీక్షకులు ఎగబడడం.. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

ఈ స్నూప్ డాగ్ ప్రదర్శనకు తాము చింతిస్తున్నామని, తాము కేవలం వినోదం కోసమే కార్యక్రమాన్ని రూపొందించామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్సాస్ అథ్లెటిక్ విభాగం క్షమాపణలు చెప్పింది. పోల్ డ్యాన్స్, మనీ గన్ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News