Putta Madhu: పుట్ట మధుకు ప్రజాకోర్టులోనే శిక్ష: మావోయిస్టుల హెచ్చరిక

  • మేడిగడ్డ విషయంలో అక్రమాలు
  • బాధితుల డబ్బు కాజేసిన పుట్ట మధు
  • కరపత్రాలను విడుదల చేసిన మావోలు

పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని సీపీఐ మావోయిస్టు మహదేవపూర్‌ - ఏటూరు నాగారం ఏరియా కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. ఆయనతో పాటు కాటారం మాజీ ఏఎంసీ చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావుకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెలలో కరపత్రాలను మావోలు విడుదల చేశారు.

 మేడిగడ్డ బ్యారేజ్ భూసేకరణలో భాగంగా మహదేవ్ పూర్ రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని పుట్ట మధు దండుకున్నారని, కోట్లాది రూపాయలను బాధితులకు అందకుండా చేశారని ఆరోపించారు. నాడు కాటారం డీఎస్పీగా ఉన్న ప్రసాదరావుతో కలిసి ప్రజలను భయాందోళనలకు గురి చేశారని అన్నారు. ఇప్పటికైనా రైతుల సొమ్ములను తిరిగి చెల్లించాలని, లేకుంటే ప్రజల చేతిలోనే శిక్షింపబడతారని హెచ్చరించారు.

More Telugu News