sbi: ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి కనుమరుగు కానున్న రూ.2000 నోటు!

  • ఆర్‌బీఐ సూచనతో పెద్ద నోట్ల క్యాసెట్లను తొలగిస్తున్న ఎస్‌బీఐ
  • ఇకపై వంద, రెండు వందల నోట్లతోనే లావాదేవీలు
  • ఆ మేరకు ఏటీఎం లావాదేవీల పరిమితి పెంపు యోచనలో ఎస్‌బీఐ

భారతీయ స్టేట్‌ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఏటీఎంలలో నుంచి ఇక రెండువేల రూపాయల నోట్లు కనిపించవు. భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) సూచనలతో దాదాపు అన్ని ఏటీఎంల నుంచి ఎస్‌బీఐ 2వేల రూపాయల క్యాసెట్లను తొలగించింది. అంతేకాదు, భవిష్యత్తులో రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే, చిన్న నోట్ల కారణంగా ఏటీఎంలలో ఉంచే నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండడంతో ఆ మేరకు లావాదేవీల పరిమితిని పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం. మెట్రో నగరాల్లో 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటును కల్పించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News