Wind: చెన్నైలో హోర్డింగ్ కేసు.. అన్నాడీఎంకే నేత వితండ వాదం!

  • శుభశ్రీ మృతి కేసులో అన్నాడీఎంకే నేత అరెస్ట్
  • టెక్కీ మృతికి గాలే కారణమంటూ అన్నాడీఎంకే నేత కొత్త లాజిక్
  • దుమారం రేపుతున్న వ్యాఖ్యలు

'తప్పు నాది కాదు, బలంగా వీచిన ఆ గాలిది' అంటున్నాడు ఓ రాజకీయనేత. ఆమధ్య చెన్నైలో ఓ హోర్డింగ్ కిందపడి శుభశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన కేసులో జయగోపాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ విషయమై స్పందించిన అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్.. శుభశ్రీ (23) మృతికి జయగోపాల్ కారణం కాదని, గాలి బలంగా వీయడం వల్లే హోర్డింగ్ కూలి ఆమెపై పడిందని, కాబట్టి గాలిపైనే కేసు నమోదు చేయాలని వితండ వాదాన్ని తెచ్చాడు. అన్నాడీఎంకే స్థానిక నేత, మాజీ కౌన్సిలర్ అయిన జయకుమార్ తన కుమారుడి వివాహానికి ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ రోడ్డు మధ్యలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు.

సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్న శుభశ్రీపై హోర్డింగ్ కూలింది. దీంతో ఆమె కిందపడగా, వెనక నుంచి వస్తున్న ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లడంతో శుభశ్రీ మృతి చెందింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా, జయగోపాల్ అరెస్ట్‌పై పొన్నియన్ మాట్లాడుతూ.. గాలిపై కేసు నమోదు చేయాలని వ్యాఖ్యానించి దుమారం రేపారు.

More Telugu News