tsrtc: ఆర్టీసీపై కుట్ర జరుగుతోంది: భట్టి విక్రమార్క

  • కేసీఆర్ అహంభావానికి ఇది పరాకాష్ఠ 
  • ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదు
  • మేం కార్మికులవైపే నిలబడతాం

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తొలగించి కొత్త సిబ్బందిని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఆ ప్రకటన ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయడం ఓ భాగమన్నారు. వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించడం ముఖ్యమంత్రి అహంభావానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదని, డీజిల్‌పై రాష్ట్రప్రభుత్వం వేసే అధిక పన్నులే కారణమని పేర్కొన్నారు. చూస్తుంటే ఆర్టీసీని హస్తగతం చేసుకునేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్రగా ఇది కనబడుతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ విషయంలో తమ పార్టీ కార్మికుల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News