Andhra Pradesh: ఏపీ క్యాపిటల్ ఆకాశంలో కట్టుకుంటే ఏ సమస్యా ఉండదు: సీపీఐ నారాయణ సెటైర్లు

  • ఎక్కడ రాజధాని నిర్మించినా సమస్య వస్తుంది
  • పొలాలు లేని గ్రామాలు ఉన్నాయా?
  • ఏపీలో పాలన రివర్స్ గేర్ లో నడుస్తోంది

ఏపీ రాజధాని అమరావతి ఒక కులానికో, వర్గానికో సంబంధించినదిగా ఉండకూడదు కనుకనే దీనిపై ఆలోచన చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అలా అయితే, ఐడియల్ గా ఉండాలంటే, ఆకాశంలో క్యాపిటల్ కట్టుకుంటే ఏ సమస్యా ఉండదని సెటైర్లు విసిరారు. ఎక్కడ రాజధాని నిర్మించినా సమస్య వస్తుంది, పొలాలు లేని గ్రామాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏపీలో పాలన రివర్స్ గేర్ లో నడుస్తోందని విమర్శించారు.

More Telugu News