Kotamreddy: చట్టానికి ఎవరూ అతీతులు కారన్న జగన్... కోటంరెడ్డిని అరెస్ట్ చేయమని డీజీపీ ఆదేశం!

  • డీజీపీకి జగన్ ప్రత్యేక ఆదేశాలు
  • భారీ బలగాలతో కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • నెల్లూరులో ఉద్రిక్త వాతావరణం

నెల్లూరు జిల్లాలో నిన్న జరిగిన పరిణామాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేవిలా వున్నాయని భావించి మొత్తం ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్, చట్టానికి ఎవరూ అతీతులు కారని, నేరం ఎవరైనా చేసినట్టు ఆధారాలు లభిస్తే, చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు తేల్చి  చెప్పారు. ఆ వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీకి విషయాన్ని తెలిపిన సవాంగ్, కోటంరెడ్డిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఆపై భారీ బందోబస్తుతో నెల్లూరులోని కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, తెల్లవారుజాము సమయంలో ఎవరికీ తెలియకుండా, ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో కోటంరెడ్డి నేరం చేసినట్టు ఆధారాలు పోలీసులకు లభించాయని తెలుస్తోంది. ఆయన్ను మరికాసేపట్లో నెల్లూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచి, ఆపై జైలుకు తరలించవచ్చని సమాచారం. చట్టం విషయంలో ఎవరికీ మినహాయింపులు వద్దని జగన్ చెప్పిన తరువాతనే కోటంరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయం ఉదయాన్నే బయటకు పొక్కడంతో, తమ నేత అరెస్టయ్యారన్న విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు రోడ్డెక్కడంతో నెల్లూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు.

More Telugu News